వర్షం రావాలని ప్రత్యేక పూజలు

5 Jul, 2015 17:48 IST|Sakshi
వర్షం రావాలని ప్రత్యేక పూజలు

బేతంచెర్ల (కర్నూలు జిల్లా): బేతంచర్ల మండల పరిధిలోని బైనపల్లె గ్రామంలో వర్షం కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా బోణాలతో వెల్లి గ్రామ దేవతలయిన సుంకులమ్మ,మారెమ్మ లతో పాటు, గంగమ్మకు అభిశేకం, కుంకమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.

అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షం పడకపోవడంతో వరుణ దేవుని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు