వేడుకగా వెంకన్న చక్రస్నానం 

20 Oct, 2018 02:02 IST|Sakshi
చక్రతాళ్వార్‌కు అవభృతస్నానం నిర్వహిస్తున్న అర్చకులు

తిరుమలలో ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల: తిరుమలలో ఈ నెల 10 నుంచి 18 వరకు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీవారి చక్రస్నానంతో గురువారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల నడుమ చక్రస్నానం వేడుకగా జరిగింది.  బ్రహ్మోత్సవాల్లో చివరిదైన చక్రస్నానం యజ్ఞా ంతంలో ఆచరించే అవభృతస్నానమే. అవభృత స్నానంలో చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిం చారు.

ఇందులో ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. ఈ అభిషేక ౖðం కర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు.  అంతకుముందు తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. అదే రోజు రాత్రి 7.00 నుంచి 9 గంటల మధ్య బం గారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. కార్యక్ర మాల్లో టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్, టీటీడీ ఈవో సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి ఈవో భాస్కర్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు. 

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
తిరుమలలో గురువారం పలువురు న్యాయమూర్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందు మల్హోత్రా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈఓ అనిల్‌కుమార్‌సింఘాల్‌ ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ ధ్వజస్తంభానికి మొక్కుకుని, స్వామివారిని దర్శించుకున్నారు.  ప్రధాని నరేంద్రమోదీ కార్యదర్శి భాస్కర్‌ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. 

మరిన్ని వార్తలు