నువ్వు ఆకాశం.. నేను నీకోసం..

14 Feb, 2020 09:09 IST|Sakshi

పరిమళిస్తున్న ప్రేమ సుమాలు

అవగాహన, నమ్మకమే పునాది

నేడు ప్రేమికుల దినోత్సవం

ప్రాప్తమనుకో ఈ క్షణమే  బతుకులాగా.. పండెనన  ుకో ఈ బతుకే మనుసు  తీరా.. అన్నాడొక కవి. దివిసీమ  తుపాను బతుకులో  కల్లోలం రేపినా.. ప్రేమ స ుమాలు పూయించి.. సేవాభావంతో పరిమళిస్తున్న  నాగరాజు, లక్ష్మి దంపతుల  బంధం ఆదర్శంగా నిలుస్తు ంది. ప్రమాదంలో కంటి  చూపు పోయినా.. నా కన ులు నీవిగా చేసుకుని చూడు..  అంటూ భరోసా ఇచ్చిన భారతితో జీవితం పండించుకున్న  వెంకటరమణను  చూస్తే ముచ్చటేస్తుంది.  నిజమైన ప్రేమ అజరామరమని.. రాఘవేం ద్రరావు, నాగమణి దం పతుల విజయవంతవై ున జీవితాన్ని పరిశీలిస్తే అవ గతమవుతుంది. వ ునల్ని ప్రేమించేవారు  పక్కనే ఉంటారని.. జ్ఞాపకా లలో వాళ్లెప్పుడూ చిరంజీవులని వందేళ్ల క్రితం  హెలెన్‌ చెక్కించిన శిలా ఫలం రుజువు చేస్తుంది.  నిన్న పరిచయమై.. నేడు ముగిసిపోయే ప్రేమ  కథలు కావివి. నిఖార్సయిన  ప్రేమతో నిజాయితీగా సాగి పోతున్న బంధాలివి. పచ్చగా  పరిమళిస్తున్న ప్రేమ సుగంధాలివి.

నీకు నేను నాకు నువ్వు
బతుకుల్లో అల్లకల్లోలం రేపిన 1972 నాటి దివిసీమ ఉప్పెనను చాలామంది మరిచిపోయారేమో.. నాగరాజుకు మాత్రం చేదు జ్ఞాపకం. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన ఇసకపల్లి నాగరాజు కుటుంబాన్ని ఉప్పెన మింగేసింది. ఇంటికప్పు విరిగిపడి కుడిచేయి పోయింది. దీంతో సహాయానికి వచ్చిన సైనికులు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత రుషికేష్‌లోని కాలా కంబల్‌ ఆశ్రమంలో చేరి గురువు వద్ద మూలికా వైద్యం నేర్చుకున్నాడు. గురువు చనిపోవటంతో భిక్షాటన చేస్తూ ఎస్‌.కోటలో పుణ్యగిరి చేరాడు. కింతాడ లక్ష్మిది విశాఖ జిల్లా పెదబయలు సమీపంలోని ముంచంగిపుట్టు గ్రామం. ఈమెకు 14యేళ్ల ప్రాయంలో పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా చూడటంతో ఆమె ఎస్‌.కోటలోని పుణ్యగిరి వచ్చేసి యాచనే మార్గంగా ఎంచుకుంది. ఆమెకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చింది. అప్పుడే నాగరాజు, లక్ష్మిల మధ్య పరిచయం అయ్యింది. ఆమెను తన కాళ్లపై నడిపిస్తానంటూ భరోసా ఇచ్చాడు. ఆమె వండి పెడతానని మాటిíచ్చింది. నాటి నుంచి తనఖా పెట్టిన స్థలంలో చిన్న పాక వేసి అనాధలకు అన్నదానం ప్రారంభించారు. తర్వాత అన్నపూర్ణాశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి భిక్షాటన చేసిన మొత్తంతో నిత్యం అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. దివ్యాంగులైన  వీరిద్దరి పవిత్రమైన ప్రేమ మరింత మంది ఆకలి తీర్చాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.                     
శృంగవరపుకోట

ఒకరికి ఒకరు
వారిద్దరూ దివ్యాంగులు..  ఇద్దరి మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం  చేసుకున్నారు. వారే మెరకముడిదాం  మండలం సిరిదేవిపురా నికి చెందిన పళ్ల లక్ష్మి,  విజయనగరం పట్టణానికి  చెందిన బొందల గణపతి.  లక్ష్మి విజయనగరంలోని  మహారాజా కళాశాలలో డిగ్రీ  చదువుతున్నప్పుడు.. అదే కళాశాల బయట వ్యా పారం చేసుకుంటున్న బొం దల గణపతిల మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ సుమారు ఐదేళ్లు  ప్రేమించుకున్నాక తల్లి దండ్రులను ఒప్పించి  వివాహం చేసుకున్నారు.  2017లో ఇద్దరికి విజయన  గరంలోని గణపతి ఇంటి  పెద్దలు వివాహం చేశారు.  ప్రస్తుతం లక్ష్మి గుర్ల  గ్రంథాలయంలో లైబ్రేరి యన్‌గా పనిచేస్తోంది.  గణపతి విజయనగరంలోని  రోడ్డుపై దుకాణం ఏర్పాటు  చేసుకొని బెల్ట్‌లు, హెల్మెట్లు, కళ్లజోళ్లు అమ్ముతున్నాడు. వీరికి మూడేళ్ల  చిన్నారి భాగ్యశ్రీ, కుమారుడు సాత్విక్‌ ఉన్నారు. వివా హమైనప్పటి నుంచి  ప్రేమానురాగాలతో ఉంటూ  ఆదర్శంగా నిలిచారు. 

నా తోడువై నా నీడవై
సీతానగరం–పెదబోగిలి  కాలనీకి చెందిన నడు కూరు శ్రీనివాస రావు,  కల్యాణి దివ్యాంగులు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. శ్రీని వాసరావు 2014లో మార్చి8న  పెద్దల సమక్షంలో  కల్యాణిని వివాహం చేసుకు న్నారు. ఇరువురికీ  స్థిరాస్తులు లేక పోయినా  తల్లిదండ్రులకు ఉన్న  మంచిపేరును ఆస్తిగా భావించి  జీవనం సాగిస్తున్నారు. శ్రీని వాసరావు తండ్రి సంగ మేశ్వరరావు స్థానికం గా మంచి పేరుంది. గ్రామ  పురోణీలు, దరఖాస్తులు  రాస్తూ కుటుంబాన్ని పోషిసు ్తన్నారు. ఈ దంపతులకు  6 ఏళ్ల వయసున్న కుమార్తె, మూడున్నరేళ్ల  కుమారుడు ఉన్నారు. 

నీవుంటే వేరే కనులెందుకు..
బాడంగి మండలం ఆకు లకట్ట గ్రామానికి చెందిన  యువకుడు బోనుమద్ది  వెంకటరమణ, శ్రీకాక ుళం జిల్లా పాలకొండ వద్ద  నర్సిపురానికి చెందిన వ రసకు మేనత్త కువ ూర్తె అయిన భారతితో  ప్రేమలో పడ్డాడు. కొన్నా ళ్లయ్యాక వెంకటరవ ుణ గ్యాస్‌ ప్రమాదంలో  ఎడమ కంటికి గాయమై  చూపు కోల్పోయాడు. ఈ సంఫ ుటన వీరి ప్రేమనుప్ర భావితం చేయలేదు.  చూపు లేదని భారతి మన  సు మార్చుకోలేదు. వెం కటరమణతోనే జీవి తమని పెద్దలకు స్పష్టం  చేసింది. వీరిద్దరూ 2017లో  పెద్దల సమక్షంలో ఫిబ్రవరి  14న ఒక్కటయ్యారు. వెం కటరమణ వడ్రంగి వృ త్తిలో స్థిరపడి కుటుంబాన్ని  పోషిస్తున్నాడు. వీరికి ఏడాది న్నర క్రితం చాందిని అనే  కుమార్తె జన్మించింది.

స్నేహితులే పెద్దలై..
బొబ్బిలి రూరల్‌: బొబ్బిలి పంచాయతీ కార్యదర్శిగా పనిచే స్తున్న తీళ్ల రాఘవేంద్ర రావు 2001 నుంచి స్వగ్రామానికి చెందిన మత్స  నాగమణిని ప్రేమించారు.  వీరి ప్రేమను పెద్దలు అంగీ కరించకపోవడంతో  స్నేహితుల సహకారంతో  2003లో పెంట గ్రామంలో వివాహం  చేసుకున్నారు. ప్రస్తుతం ఓ పాప, బాబుతో హాయిగా  ఉంటున్నారు. 

ఆదర్శ దంపతులు 
మండలంలో అలజంగికి  చెందిన యజ్జల విజయానంద్‌ కుమార్, చిన్నమ్మలు  ప్రేమికులు. దివ్యాంగుడైన  విజయానంద్, అదే గ్రామా నికి చెందిన చిన్నమ్మలును  12ఏళ్ల క్రితం ప్రేమించాడు. వీరిద్దరు తమ ప్రేమను పెద్దలకు చెబితే తొలుత ససేమిరా అన్నారు. అనం తరం వీరి ప్రేమను గుర్తించి  వివాహం జరిపారు. దివ్యాంగుడైన విజయానంద్, చిన్న మ్మలు ఎంతో అప్యాయతానురాగాలతో హాయిగా ఉన్నారు.  వీరికి కుమార్తె ఆశాజ్యోతి,  కుమారుడు సూర్య  నాగచైతన్య ఉన్నారు.  ప్రేమకు వైకల్యం అడ్డు కాదని వీరు నిరూపించారు. 
– బొబ్బిలి రూరల్‌ 

హాయిగా ఉన్నాం 
ఎంతో హాయిగా ఆనందంగా జీవ నం సాగిస్తున్నాం. పెద్ద లను ఎదిరించి ప్రేమవివాహం  చేసుకున్నా ప్రస్తుతం అం దరం కలిసి ఆనందంగా  జీవిస్తున్నాం. పెద్దలు మమ్మల్ని అంగీకరించారు. 
–  రాఘవేంద్రరావు,పంచాయతీ కార్యదర్శి, బొబ్బిలి 

అర్థం చేసుకున్నాం 
ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తున్నాం. ఒకరి  భావాలను ఒకరం గౌరవిం చుకుంటున్నాం. పిల్లలతో  ఆనందంగా.. ఆదర్శంగా  జీవిస్తున్నాం 
– నాగమణి, బొబ్బిలి 

అన్నపూర్ణాశ్రమంలో  భార్య లక్ష్మికి అన్నం తినిపిస్తున్న నాగరాజు 

మరిన్ని వార్తలు