హింసించడమే..!

30 May, 2019 13:48 IST|Sakshi

అగ్ని గుండంలా మారిన జిల్లారెండు మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత17 మండలాల్లో 40–44 డిగ్రీల నమోదు32 మండలాల్లో తీవ్రంగా వడగాడ్పులు9 మండలాల్లో పిడుగు పడే హెచ్చరికలుజాగ్రత్తలు తీసుకోకుంటే అంతేసరి

ఒంగోలు సిటీ:ఉగ్రరూపం దాల్చిన భానుడు జనాలపై పగబట్టాడు. వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు అనారోగ్యం బారినపడ్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గడం లేదు. కొన్ని మండలాల్లో నిత్యం 46 డిగ్రీలకు తగ్గడం లేదు. బుధవారం పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు, బల్లికురవ మండలం కొప్పెరపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44–45 డిగ్రీల మధ్య కురిచేడు, వెలిగండ్ల మండలంలోని రాళ్లపల్లి, బల్లికురవ, దొనకొండ, దర్శిలో నమోదయ్యాయి.

వడదెబ్బకు బలి
జిల్లా వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో 50 కి.మీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, కురిచేడు, దొనకొండ, పెద్దారవీడు, దోర్నాల, అర్ధవీడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి, ల్లికురవ, సంతమాగులూరు, యద్దనపూడి, మార్టూరు, పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, జె.పంగులూరు, కంభం, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, సీఎస్‌పురం, వెలిగండ్ల, పీసీపల్లి, చిన్నగంజాం, పామూరు, ఉలవపాడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, కొరిశపాడు, మద్దిపాడు, చీమకుర్తి, వీవీపాలెం, మర్రిపూడి, కనిగిరి, హనుమంతునిపాడు, బేస్తవారిపేట, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, టంగుటూరు, జరుగుమల్లి, కందుకూరులో వడగాడ్పుల దెబ్బకు జనం బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
జిల్లాలో ఎండల తీవ్రత మరో మూడు రోజులు ఉంటాయని వాతావరణ పరిశోధన అధికారులు చెబుతున్నారు. వడగాడ్పులు 50 కి.మీ వేగంతో నమోదవుతాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలి. వృద్ధులు, పిల్లల్ని వేసవి నుంచి రక్షించుకొనే చిట్కాలు పాటించడం తప్పని సరి.

వేసవికి మస్కా కొట్టే చిట్కాలు ఇలా..
ఎండ మరీ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలను బయటకు తీసుకురాకుండా చూడడం మంచిది. నెలల వయస్సు ఉన్న చిన్నారులను ఎండకు పూర్తిగా దూరంగా ఉంచాలి.
పిల్లలకు వదులుగా ఉన్న కాటన్‌ దుస్తులను వేయాలి. ఆర్గానిక్‌ కాటన్‌ అయితే సున్నితమైన పిల్లల చర్మానికి మరింత మేలు.
పిల్లలు బయటకు వెళ్తున్నా ఇంట్లో ఎండ పడే చోట ఉన్నా వారికి టోపీలను విధిగా వాడాలి. గాలి చొరబడే వీలున్న టోపీలను కొనాలి. ఇలాంటివి వాడడం వల్ల పిల్లల తల వేడెక్కకుండా ఉంటుంది.
వేసవిలో పిల్లల డైపర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఉపయోగించే డిస్పోజల్‌ డైపర్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి.
వేసవిలో పిల్లలకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి తరుచూ పాలు పట్టాలి. దాహం తీర్చడానికి నీళ్లు ఇవ్వాలి. ూ చంటి పిల్లల ఉయ్యాల వారు పడుకొనే మంచం ఇంట్లో చల్లని ప్రదేశంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కిటికీలు తలుపుల ద్వారా సూర్యకాంతి వారిపై పడకుండా చూడాలి.

వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా
జిల్లాలో వడదెబ్బ మృతులు ఇప్పటికి 130కిపైగా ఉన్నారు. వడగాడ్పులకు తట్టుకొనే శక్తి వృద్ధులకు తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకొని వేసవి సమస్యలకు దూరంగా ఉండే వీలుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. వారి శరీరానికి నీటికి నిల్వ ఉంచుకొనే శక్తి తక్కువగా ఉంటుంది. వారికి దాహం అంతగా తెలియదు. అందుకే వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా శరీర వ్యవస్థ సర్దుబాటు చేసుకొనే చిట్కాలు పాటించాలి.
తాము నిత్యం వాడుకొనే మందుల్లో వేడికి  ప్రభావితమయ్యే మందులు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. కొన్ని రకాల మందులు గది వేడి కంటే ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో ఉంచితే పని చేయవు. ఇంట్లో ఏసీ లేని వారు తాము వాడుతున్న మందుల్లో ఈవిషయాన్ని నిర్ధారించుకోవాలి.
ఉష్ణోగ్రతల్లో కాస్త మార్పులు వచ్చినా అది వీరిపై  అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. వృద్ధులు వంటరిగా ఉన్నట్లయితే వారి పిల్లలు గాని ఇతర సంరక్షకులు వారి క్షేమసమారాలను తెలుసుకుంటుండాలి.
తమ వద్ద అత్యవసర ఫోన్‌ నంబర్లను ఉంచుకోవాలి. లేత రంగుల్లో వదులైన కాటన్‌ దుస్తులు వాడాలి. పెద్దవాళ్లల్లో కంటి సమస్యలు ఉంటాయి. దానికి తోడు ఎండలో తిరిగితే కంటికి మరింత హాని కలుగుతుంది. సూర్యకాంతి కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్‌ కన్నా  ఎక్కువ ఉన్నా గందరగోళంగా తికమకగా ప్రవర్తిస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
బయటకు వెళ్లినప్పుడు టోపీలు, సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడాలి. నడక, తోటపని, వ్యాయామాలు చేస్తుంటే అధికంగా నీరు తీసుకోవాలి. ఎక్కువ సమయం బయట తిరగకూడదు.
ఆహారంలో ఇవి తీసుకోవాలి
వేసవిలో నీరు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసి యాంటీ ఆక్సిడెంట్లు పెంచుతాయి.
ఉల్లిపాయలు, ఆకుపచ్చని కూరగాయలు, మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలు, యాపిల్స్,  సొరకాయ, దోస వంటివి తినాలి. వీటిలో నీరు శాతం అధికంగా ఉంటాయి. మేలు చేస్తాయి. శరీరంలో వేడి పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. పుల్లని పండ్లు, బీట్రూట్, క్యారెట్‌ వంటివి శరీరంలో వేడి పెంచుతాయి.
వెల్లుల్లి, మిర్చి ,టమోటా, ఉప్పుతో కూడిన చీజ్‌ వంటివి తినకూడదు. సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముదురు రంగులో ఉన్న మాంసాహారాన్ని తీసుకోకూడదు. మధ్యాహ్నం వేళలో ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి. ఎండా కాలంలో మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోతే పిత్త దోషం పెరిగి ఇబ్బంది పెడుతుంది. వేడిగా ఉన్న పానీయాలు తాగకూడదు. వేసవిలో చల్లని ఐస్‌క్రీమ్‌లు తింటుంటారు. ఇవి జీర్ణక్రియను అడ్డుకుంటాయి. వీటి వల్ల జఠరాగ్నిని చల్లార్చి రోగాలను కొనితెచ్చుకోవమే అవుతుంది.

మరిన్ని వార్తలు