మొక్కులు ఫలించాయి..సూర్యకళ కోలుకుంటోంది

11 May, 2018 12:42 IST|Sakshi
ఆస్పత్రిలో సూర్యకళ కళ్లు తెరిచి చూడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబసభ్యులు, సూర్యకళ తల్లి నాగలక్ష్మికి రూ.లక్ష విరాళం అందిస్తున్న స్కూల్‌ స్నేహితులు

కళ్లు తెరిచిన సోడా సిలిండర్‌ బాధితురాలు

పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్‌: ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పది రోజులుగా భీమవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిట్టినీడి సూర్యకళ నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ఈ ప్రాంత ప్రజలు దేవుళ్లను మొక్కారు. మనసున్న దాతలు సూర్యకళ వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు. యువత విరాళాలు సేకరించి తమ వంతు సహాయం అందించారు. ఈనెల 1న భీమవరం వైఎస్సార్‌ కాలనీ ప్రాంతంలో సోడా గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఒక ఇంటి గోడను చీల్చుకుని లోపలికి దూసుకు వెళ్లిన సంఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రం గా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన సూర్యకళ ఇంటర్‌ పాసై డిగ్రీలో చేరేందుకు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కుమార్తె వైద్య కోసం తల్లిదండ్రులు వెంకట శివకుమార్, నాగలక్ష్మిలు తల్లడిల్లిపోయారు.

ఈ సమయంలో మేమున్నామంటూ భీమవరం ప్రజలు ముందుకు వచ్చారు. వైద్యానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం కావడంతో చాలా మంది సహాయపడుతున్నారు. ఈ సమయంలో భీమవరం హాస్పటల్స్‌ వైద్యుల కృషి చాల వరకూ ఫలించింది. ఆపరేషన్‌ అనంతరం సూర్యకళ కళ్లు తెరిచి అందరినీ గుర్తుపడుతోంది. నెమ్మదిగా మాట్లాడగలుగుతున్న ఆమెను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషపడుతున్నారు. అయితే సూర్యకళ కాలుకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం ఉండటంతో హైదరాబా ద్‌కు పంపాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. సూర్యకళ సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిగ్రీలో చేరాలన్న కోరిక నెరవేరేందుకు మరికొంత ఆర్థిక సహాయం అవసరమవుతుంది. దాతలు స్పందిస్తే సూర్యకళ తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ వివరాలు. ఆంధ్రాబ్యాంక్‌ ఖాతా నంబర్‌ : 004610100038569, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌   ANDB 0000046. వివరాల కోసం సెల్‌ నెంబర్‌ 91777 33995, 77990 24033లో సంప్రదించాలని కోరుతున్నారు.

స్నేహం కోసం.. స్పందించిన హృదయం
తమ చిన్ననాటి స్నేహితురాలిని కాపాడుకునేం దుకు మిత్రులంతా ఒక్కటయ్యారు. ఆపన్న హస్తం అందించారు. లక్ష రూపాయలు విరాళం సేకరించారు. దాతలు స్పందిం చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యకళతో ఎస్‌ యూఎస్‌ హైస్కూ ల్‌లో చదువుకున్న మిత్రులు ఆమె ఆరోగ్యం కోసం తపిస్తున్నారు. అందరూ ఒక్కటిగా కలిసి విరాళాలు సేకరించి సూర్యకళ తల్లి నాగలక్ష్మికి గురువారం అందజేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా