తెలుగుదేశం నాయకుల అరాచకం

16 Apr, 2019 13:51 IST|Sakshi

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే అనుమానంతో దంపతులకు బెదిరింపులు

ఊరు విడిచి వెళ్లాలని ముస్లిం కుటుంబానికి హుకుం  

నెల్లూరు, అనుమసముద్రంపేట: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఓ ముస్లిం కుటుంబాన్ని బెదిరించిన ఘటన ఏఎస్‌పేట మండలంలోని రాజవోలు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. వారి కథనం మేరకు.. రాజవోలుకు చెందిన షేక్‌ బీబీజాన్, ఖాజా మస్తాన్‌లు భార్యాభర్తలు. మస్తాన్‌ ఆటో నడుపుతుంటాడు. ఈనెల 11వ తేదీన ఎన్నికల్లో వారిద్దరూ టీడీపీకి కాకుండా వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని అనుమానిస్తూ టీడీపీకి చెందిన కొందరు ఆదివారం రాత్రి మస్తాన్‌ ఇంటికి వెళ్లారు. బెదిరింపులకు దిగారు. ‘వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ఈ ఊర్లో ఉండాలనుకుంటున్నారా? ఎంత ధైర్యం మీకు? తక్షణం ఊరొదిలి వెళ్లకుంటే మీ ఇంటిని ధ్వంసం చేస్తాం’ అని హెచ్చరించారు. భయాందోళనకు గురైన దంపతులు సోమవారం ఏఎస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కొందరు పెద్దలు రాజీ చేస్తామని వారిని వెనక్కు తీసుకువెళ్లారు. కాగా ఆ కుటుంబం ప్రస్తుతం భయం గుప్పెట్లో ఉంది.

మరిన్ని వార్తలు