ఏపీ కేబినెట్‌ కీలక భేటీ నేడు

13 Nov, 2019 09:07 IST|Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ ఈ ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఇసుకపై ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ నేడు కొనసాగుతుంది.

కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే భద్రత కమిషనర్‌ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద స్థలాన్ని నేడు ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించనుంది.

మహారాష్ట్ర గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ తీసుకురావాలన్న పిటిషన్‌పై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది.

బ్రెజిల్‌లో నేడు ప్రారంభం కానున్న బ్రిక్‌ దేశాల 11వ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

హైదరాబాద్‌లో నేడు..
దత్తోపంత్‌ రేంగ్డీజీ శతజయంతి ఉద్ఘాటన
వేదిక : హరి హర కళా భవన్‌
సమయం : సాయంత్రం 4 గంటలకు.  

చాడఖై స్పెషల్‌..
వేదిక : కళింగ కిచెన్‌
సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు.

బాలల దినోత్సవం
వేదిక : గ్లెన్‌డేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, హెచ్‌ఎండీఏ లే అవుట్, తెల్లాపూర్‌
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు.

తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి
వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ
సమయం : 4.30 గంటలకు.

వేదిక : సర్దార్‌ పటేల్‌ రోడ్డు, మారేడ్‌పల్లి
రోషిణి ఆధ్వర్యంలో భరత నాట్యం తరగతులు
సమయం : 5.30 గంటలకు.
కరాటే శిక్షణ తరగతులు
సమయం : రాత్రి 8 గంటలకు.
ఉచిత యోగ తరగతులు
సమయం : ఉదయం 11 గంటలకు
యోగ ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌ షాప్‌
సమయం : 8.30 గంటలకు.

ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌
వేదిక : వైఎంసీఏ ఆఫ్‌ హైదరాబాద్‌
సమయం : మధ్యాహ్నం 2 గంటలకు.

యశ్వంత్‌ సిన్హా, కరణ్‌ సింగ్‌ల ఆధ్వర్యంలో ఆల్‌జీబ్రాలో శిక్షణ  
వేదిక : సర్వే నెం. 64, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌
సమయం : రాత్రి 7 గంటలకు

ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌  వర్కర్ల ధర్నా
వేదిక : ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌  
సమయం : ఉదయం 11 గంటలకు.

కోటి దీపోత్సవం..2019
వేదిక: ఎన్‌టీఆర్‌ స్టేడియం
సమయం : సాయంత్రం 6 గంటలకు.

టీవీ ఛానల్‌ రన్‌ బై స్కూల్‌ కిడ్స్‌
వేదిక : ది హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్, సోమాజీగూడ
సమయం : మధ్యాహ్నం 12 గంటలకు.

అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలు..2019
వేదిక : ఓంకార్‌భవన్, బాగ్‌లింగంపల్లి.
సమయం : ఉదయం 11 గంటలకు.

ఆది ధ్వని సంగీత వాద్య ప్రదర్శన ముగింపు సభ
వేదిక : స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ
సమయం : 4.30 గంటలకు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా