నేడు సీఎం రాక

20 Nov, 2013 02:20 IST|Sakshi

తిరుపతి, న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి స్పెషల్‌విమానంలో చెన్నైకి చేరుకుంటారు. హెలికాప్టర్‌లో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీకి ఉదయం 8.40 గంటలకు చేరుకుని అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమవుతారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకు ని వివిధ యూనిట్లకు భూమిపూజ నిర్వహిస్తారు. హెలికాప్టర్ ద్వారా 11.45 గంటలకు తిరుపతి ఎస్వీయూ మైదానంలో ఏర్పాటు చేసి న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12 గంటలకు తిరుపతిలో నిర్మించనున ్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుం చి 12.20 గంటలకు స్విమ్స్‌కు చేరుకుని పద్మావతి మహిళా మెడికల్ కళాశాల, చిత్తూరుకు నీటిసరఫరా పథకాలకు శంకుస్థాన  చేస్తారు. జిల్లేళ్లమందలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
 30 ఎకరాల్లో మూడు గ్రౌండ్‌లు
 తిరుపతిలో నిర్మించే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ముప్పై ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి బుధవారం స్టేడియం పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. రూ.30 కోట్ల అంచనాతో మూడు మైదానాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడడానికి వీలుగా ఒకటి, రంజీ మ్యాచ్‌ల కోసం మరొకటి, జిల్లా స్థాయి మ్యాచ్‌లకు మరొకటి మొత్తం మూడు మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు