ఈనాటి ముఖ్యాంశాలు

14 Dec, 2019 18:54 IST|Sakshi

రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు పరిశ్రమల శాఖ నివేదికతోనే ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిషోర్‌పై వేటు వేయడం జరిగిందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇకపోతే పవన్‌ కల్యాణ్‌ సమాజాన్ని విచ్ఛిన్న పరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని జనసేనకు గుడ్‌బై చెప్పిన పవన్‌ కల్యాణ్‌ సన్నిహితుడు రాజు రవితేజ విమర్శించారు. ఇక, దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ‍్యతిరేకిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకా, ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

>
మరిన్ని వార్తలు