యానాంలో అద్భుత దృశ్యం

17 Jul, 2020 17:12 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లా యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్‌లో బంధించడమే కాకుండా వైరల్‌ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు