టీటీడీ ఉద్యోగుల ధర్నా

22 Nov, 2014 02:26 IST|Sakshi
టీటీడీ ఉద్యోగుల ధర్నా

తిరుపతిసిటీ: టీటీడీలో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు శుక్రవారం తిరుపతి పరిపాలన భవనం ఎదుట బైఠాయించాయి. నియంతలా వ్యవహరిస్తున్న టీటీడీ యాజమాన్యం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ఉద్యోగులు దీక్ష బూనారు. డెప్యుటేషన్‌పై వచ్చే వారిని నెత్తిన పెట్టుకుని మోయడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించాయి.

విజిలెన్స్ విభాగం పెత్తనంపై ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్నచిన్న తప్పులు చేసినా వివరణ కూడా తీసుకోకుండా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. అసలు నేరుగా విజిలెన్సు విభాగం ఫిర్యాదు చేస్తే ఈవో చర్యలు తీసుకోవడంలో అర్థంలేదన్నారు. క్రమశిక్షణ విభాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా శిక్షించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై టీటీడీ యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో ప్రత్య క్ష పోరాటాలకు దిగామని చెప్పారు.

కులం పేరుతో దూషిస్తే కాలరు పట్టుకోండి..
టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఉద్యోగు ల పట్ల అమానుషంగా వ్యవహరిస్తే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయని తిరుప తి మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు. టీటీడీ ఉద్యోగుల ధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. సాటి ఉద్యోగిని కులం పేరుతో దూషిస్తే కాల రు పట్టుకోండని అన్నారు.

మంత్రుల చుట్టూ, డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగి డెప్యుటేషన్ పోస్టింగ్స్ ఇప్పించుకు ని స్థానిక ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తు న్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యనతో పాటు కాంగ్రెస్ నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి ఉన్నారు. ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులు చాడా మధుసూదన్, వెంకటరమణారెడ్డి, నాగార్జున, కల్పన, లక్ష్మీనారాయణ. సుబ్రమణ్యం, మోహన్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, మునిరెడ్డి, వెంకటేష్, పూజారి రత్న ప్రభాకర్‌తోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
 
ఉద్యోగులతో ఈవో చర్చలు సఫలం
ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతో టీటీడీ యాజమాన్యం రంగంలోకి దిగింది. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ శుక్రవారం ఉద్యోగ సంఘాలతో భేటి అయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. టీటీడీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హమీ ఇవ్వడంతో పాటు అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు.

ఉద్యోగ సంఘాల నుంచి వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, ఇందిర, ఉమామహేశ్వ రెడ్డి, మునికుమార్‌తో కమిటీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రంలోపు కమిటీ విచారణ చేపట్టి ఉద్యోగులకు జరిగిన అన్యాయాలపై తుది నివేదికను అందజేస్తే న్యాయం చేస్తామని ఈవో హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు ధర్నా నిలిపివేసి విధులకు హజరయ్యారు.

మరిన్ని వార్తలు