ఎస్కేప్ అల్లాభక్షు అరెస్ట్

6 Dec, 2014 02:13 IST|Sakshi

రెండేళ్ల తర్వాత చిక్కిన వైనం
 నెల్లూరు(క్రైమ్): ఎస్కార్టు పోలీసుల క ళ్లు గప్పి పరారైన జీవిత ఖైదీ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అల్లాభక్షు ఎట్టకేల కు రెండేళ్ల తర్వాత పోలీసులకు చిక్కా డు.  నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దనరెడ్డికాలనీకి చెందిన అల్లాభక్షు పలు కేసుల్లో నిందితుడు. అతడు బా బి, వెంకటేష్, మధు కలిసి జేబు దొం గతనాలకు పాల్పడేవారు. అలా వ చ్చిన సొమ్మును సమానంగా పంచుకొనేవారు. పంపిణీలో బేధాలు పొడచూపడంతో 2009లో బాబిని అల్లాభక్షు, వెంకటేష్, మధు హత్యచేశారు. వారి పై నేరం రుజువు కావడంతో  2011డిసెంబర్ 13న కోర్టు వారికి జీవితఖైదు విధించింది. అంతకుముందే అల్లాభక్షుపై ఒకటో నగర పోలీసుస్టేషన్‌లో రెండు చోరీ కేసులున్నాయి.
 
 ఆ కేసుల విచారణకు సంబంధించి అతడిని ఎస్కార్టు పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరిచేవారు. ఈ క్రమంలో 2012 మార్చి 31న  కలెక్టరేట్ ఆవరణలోని కోర్టుకు తీసుకెళ్లగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అనంతరం అదే ఏడాది ఏప్రిల్ 14న అరెస్ట్ చేశారు. పరారైన కేసుతో పాటు చోరీ కేసుకు సంబంధించి నవంబర్ 1న ఆయన విచారణకు హాజరుకావల్సి ఉంది. దీంతో మరో 13 మంది ఖైదీలతో కలిపి 1వ తేదీన పోలీసులు కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరిచారు. తిరిగి జైలుకు తరలిస్తున్న సమయంలో చేపల మార్కెట్‌కు సమీపంలో వాహనం కిటికీలో నుంచి దూకి అల్లాభక్షు పరారయ్యాడు.
 
 ఇతడి పుణ్యమాని రెండు సార్లు కలిపి 10 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరోవైపు పరారైన అల్లాభక్షు విజయవాడకు చేరుకొని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఓ వృద్ధురాలి వద్ద ఆశ్రయం పొందాడు. తాను అనాథనని ఆమెను నమ్మించి రైళ్లలో చిరువ్యాపారాలు చేయసాగాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ స్నేహితులుగా మారి చిన్నచిన్న నేరాలు చేయసాగారు. ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపడం తో ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
 దీంతో విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసుల బృందం గురువారం అల్లాభక్షును అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో నెల్లూరు నాల్గోనగర పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు పోలీసులు శుక్రవారం అక్కడికి చేరుకుని అల్లాభక్షును అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.
 

మరిన్ని వార్తలు