కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో అపశ్రుతి

2 Jul, 2013 12:14 IST|Sakshi

గన్నవరం : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్వాగతర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ర్యాలీలో ఏర్పాటుచేసిన ట్రక్ ఆటోలోని బాణసంచాకు ప్రమాదశాత్తూ నిప్పంటుకుని ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కేంద్ర జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరికి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నేతలు, కార్యకర్తలు ఉదయం గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికి ర్యాలీగా ఏలూరు బయలుదేరారు. చిన్నఅవుటపల్లి సమీపంలోకి రాగానే ర్యాలీ మధ్యలో ఉన్న ట్రక్ ఆటోలో ఒక్కసారిగా భారీ పేలు డు సంభవించింది.

విజయవాడ కృష్ణలంకలోని బందరు లాకుల వద్ద నివసిస్తున్న కూలీలు బాడపు సత్యనారాయణ (24), సూదల సూరిబాబు (35) లు బాణసంచా కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ మంటలు ట్రక్ ఆటోలోని మందుగుండు సామగ్రికి అంటుకోవడంతో ఈ ఘటన జరిగింది.

ఈ పేలుడుకు సత్యనారాయణ, సూరిబాబులు ఎగిరి కిందపడిపోవడంతో పాటు ఆటోకు మంటలు అంటుకున్నాయి. దానికి డ్రైవర్‌గా ఉన్న గన్నవరానికి చెం దిన రిటెర్డ్ ఆర్టీసీ డ్రైవర్ వడ్లమూడి పుల్లయ్య (60) అందులో చిక్కుకున్నా రు. అంబులెన్స్‌లో వారిని సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించా రు. అపస్మారక స్థితికి చేరుకున్న సూరిబాబును మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పుల్లయ్యకు ఇక్కడే వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు