29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 

22 Sep, 2019 20:07 IST|Sakshi
ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న వెలంపల్లి 

మూలానక్షత్రం రోజున అమ్మవారికి 

పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్న సీఎం 

ఆహ్వానపత్రిక ఆవిష్కరించిన మంత్రి వెలంపల్లి 

వన్‌టౌన్‌ (విజయవాడ పశి్చమ): బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవాలు ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 8 వరకూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను మంత్రి  విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

అమ్మవారు 29న శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా, 30న శ్రీ బాలత్రిపురసుందరీదేవి, అక్టోబర్‌ 1న శ్రీగాయిత్రీదేవి, 2న శ్రీఅన్నపూర్ణాదేవి, 3న శ్రీలలితాత్రిపురసుందరీదేవి, 4న శ్రీమహాలక్ష్మీదేవి, 5న శ్రీసరస్వతీదేవి, 6న శ్రీ దుర్గాదేవి, 7న శ్రీ మహిషాసురమరి్ధనీదేవి, ఎనిమిదిన శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. 8న అమ్మవారికి కృష్ణానదిలో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

ఐదో తేదీన మూలన్రక్షతం రోజున  అమ్మవారికి సీఎం వైఎస్‌ జగన్‌ పట్టు వ్రస్తాలు సమరి్పస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా చక్కని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో ఎంవీ సురేశ్‌బాబు, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమేశ్‌, ఆలయ ప్రధాన అర్చకులు లింగం¿ొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు రంఘవఝుల శ్రీనివాసశాస్త్రి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు