ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

8 Sep, 2018 11:38 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 16న విజయనగరంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ భేటి ఉంటుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఈ నెల 10న సిరిపురం విజ్ఞాన్‌ గ్రౌండ్‌లో బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వివరించారు. అదే విధంగా వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల11న వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు సమావేశం ఉంటుందని.. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్లు హాజరవుతారన్నారు. ఈ నెల 12న అరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లింలతో వైఎస్‌ జగన్‌ ఆత్మీయ సమవాశం ఉంటుదన్నారు. అదేవిధంగా ఈ నెల 15న న్యాయవాదులు వైఎస్‌ జగన్‌ను కలవనున్నారని వివరించారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముసుగులో సర్దుబాట్లు!

ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర

పాక్‌ ప్రధానిని బాబు విశ్వసించడమా?

కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవో

కాబోయే సీఎం జగనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి