రైల్వే పోలీసుల నిజాయితీ

17 Dec, 2018 13:14 IST|Sakshi
బ్యాగ్‌ను మహిళకు అందజేస్తున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది

రూ.70 వేల నగదు, పది తులాల బంగారం ఉన్న బ్యాగు ప్రయాణికురాలికి అందజేత

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం తెలవారుజామున విశాఖపట్నం చేరుకున్న ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో బి – 3 సీట్‌ నెం.12లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు తన విలువైన బ్యాగ్‌ను మరచిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఏఎస్‌ఐ పి.సి.యమ్‌.రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ వై.బక్కయ్య తనిఖీలలో ఈ బ్యాగ్‌ను గుర్తించారు. బ్యాగ్‌లో 70వేల నగదు, 10తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి గుంటూరు నుంచి వస్తున్న నగరానికి చెందిన వై.సరస్వతిగా గుర్తించారు. రైలు దిగే కంగారులో ఆమె బ్యాగ్‌ మరిచిపోయిందని గుర్తించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది సీట్‌ నెంబర్‌ ఆధారంగా పిలిపించి ఆమెకు బ్యాగ్‌ను అందజేశారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది నిజాయితీని డివిజినల్‌ స్థాయిలో గుర్తించి సత్కరిస్తారని, ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే రావు తెలిపారు.

మరిన్ని వార్తలు