విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ పెద్దపీట

17 Sep, 2019 12:56 IST|Sakshi

విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

సాక్షి, తాడేపల్లి: విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో సీఎం ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. విశ్వకర్మ భగవానుడు విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి అని.. విశ్వకర్మలను విశ్వ భగవానుడి వారసులుగా ఆయన పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణలు లేని వృత్తి లేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు