పరీక్షలు ప్రశాంతం

3 Feb, 2014 04:34 IST|Sakshi
  ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు 87.45 శాతం హాజరు నమోదైంది. ఉద యం 10 గంటలకు జిల్లా వ్యాప్తంగా 137  కేంద్రాల్లో పరీక్ష జరగ్గా 44 వేల 394 మంది హాజరయ్యారు. మొత్తం 51 పోస్టులకు  50 వేల 741 మంది దరఖాస్తు చేయగా 6,347 మంది గైర్హాజరయ్యారు. ఏలూరు నగరంలోని 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించిన వీఆర్‌ఏ పరీక్షకు 6,502 మంది హాజరయ్యారు. మొత్తం 360 పోస్టులకు 7,435 మంది దరఖాస్తు చేయగా 933 మంది గైర్హాజరయ్యారు.  ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా యంత్రాంగం క ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులను గేటు బయట వద్ద తనిఖీలు చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి కేంద్రంలో  పరీక్ష జరుగుతున్న తీరును వీడియో తీసి భద్రపరిచారు. పరీక్ష హాల్లో అభ్యర్థి వివరాలకు సంబంధించిన గడిలో 
 ఇన్విజిలేటర్లు వే లిముద్రలను తీసుకున్నారు. 
 
 బస్సులు సకాలంలో నడవక 
 అభ్యర్థుల ఇక్కట్లు
 ఆర్టీసీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి బస్సులను వివిధ పరీక్షా కేంద్రాలకు నడుపుతున్నట్టు ప్రకటించినప్పటికీ సకాలంలో బస్సులను నడపలేదని అభ్యర్థులు ధ్వజమెత్తారు. తెల్లవారుజామునే మంచులో పాతబస్టాండ్, కొత్త బస్టాండ్, ఆశ్రం ఆసుపత్రి వద్ద, వివిధ ప్రాంతాల్లో బస్సుల కోసం అభ్యర్థులు తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురుచూపులు చూశారు. ఆ సమయానికి బస్సులు రాకపోవడంతో హడావుడి పడ్డారు. ఈ కారణంగా కొందరు పరీక్షలను రాయలేకపోయారు. 
 
 ఉరుకులు, పరుగులు
 అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినా చాలా మంది పట్టించుకోలేదు. దీంతో కొందరు అభ్యర్థులు చివరి అరగంటలో ఉరుకులు, పరుగులు పెట్టారు. నిమిషం ఆలస్యమయి నా అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులు పరీక్షా కేంద్రాలు తెలిపే లే-అవుట్‌లు, చార్టులు ఏర్పాటు చేసినా సకాలంలో రాకపోవడంతో కూడా అవి సరిగ్గా చూడక తికమక పడి మిస్సయ్యారు.
 
 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
 ఏలూరు నగరంలోని భాష్యం, శనివారపుపేట జెడ్పీ హైస్కూల్, శాంతినగర్‌లోని భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్, తంగెళ్లమూడిలోని నోవా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఉదయం కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా ఏర్పాట్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పరీక్షల తీరును కార్యాలయ సూపరింటెండెంట్లతో సమీక్షించి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ టి.బాబూరావునాయుడు పాల్గొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు కో-ఆర్డినేటర్‌గా జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవోలు   కో-ఆర్డినేటర్లుగా వ్యవహరించారు.
 
>
మరిన్ని వార్తలు