వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఫ్లైఓవర్

28 Nov, 2013 03:24 IST|Sakshi

కరీంనగర్‌కు ముఖద్వారం.. అల్గునూర్ వంతెన. ఈ వంతెనపై ఇరువైపులా  ఏ సంఘటన జరిగినా వాహన చక్రాలకు బ్రేక్‌లు పడుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సంఘటనలు కోకొల్లలు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నారుు. ట్రాఫిక్ స్తంభించడంతో వరంగల్, హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాజీవ్హ్రదారి విస్తరణ పనుల్లో భాగంగా మానేరుపై మరో వంతెన సిద్ధమవుతున్నా... అల్గునూర్ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌తో తమ  విలువైన ఆస్తులు కోల్పోతామని, ప్రత్యామ్నాయం చూడాలని  గ్రామస్తులు డిమాండ్ చేస్తుండడంతో నిర్మాణం ముందుకు సాగడం లేదు.
 
 తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రానికి అత్యధికంగా వాహనాలు అల్గునూర్ మీదుగానే వస్తుంటాయి. హైదరాబాద్, వరంగల్ రూట్లనుంచి కరీంనగర్ రావాలన్నా... పోవాలన్నా... మానేరు వంతెన దాటాల్సిందే. మరో గత్యంతరం లేదు. ఇప్పుడు ఈ వారధి వాహనదారులకు నిత్యం పరీక్ష పెడుతోంది.
 
 వంతెనపై ఎప్పుడు ఏ వాహనం ఆగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ కారణంతోనైనా చిన్న వాహనం ఆగినా మిగతా వాహనాలన్నీ నిలిచిపోతాయి. ఓ సారి అత్యవసర సేవలందించే 108 ఇరుక్కుని బెజ్జంకి మండలం ఖాసింపేటకు చెందిన ఓ వృద్ధురాలు అల్గునూర్ చౌరస్తాలోనే తుదిశ్వాస విడిచింది. పెద్ద వాహనాలు ఆగితే పరిస్థితి మరీ ఘోరం. హైదరాబాద్ నుంచి రామగుండం మీదుగా చెన్నూర్ క్రాసింగ్ వరకు రాజీవ్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు.
 
 ఇందులో భాగంగా మానేరుపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. అప్రోచ్ రోడ్ పనులు మాత్రం మిగిలి ఉండగా... ట్రాఫిక్ మళ్లింపు ఎలా? అనే విషయం ఎటూ తేలడం లేదు. వరంగల్ నుంచి వచ్చిపోయే వాహనాలు, హైదరాబాద్ నుంచి వచ్చిపోయే వాహనాలతో అల్గునూర్ జంక్షన్‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో జంక్షన్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం తప్పనిసరి.
 
 ఫ్లైఓవర్ ఎటు వైపు నిర్మిస్తారో? అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూడగా.. వరంగల్ రోడ్‌లో నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు డిజైన్ చేశారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను ఫ్లైఓవర్‌పైనుంచి అనుమతి ఇస్తారు. ఈ ఫ్లై ఓవర్ నూతన వంతెనకు కలుపుతారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిం చారు. దీనికి నిధుల విషయంలో ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించడంలో జాప్యం జరుగుతోంది.
 
 భూసేకరణ సమస్య
 వరంగల్ వైపు ఫ్లైఓవర్ నిర్మాణంతో ఆ వైపు రహదారి వెంట భూ సేకరణ సమస్యగా మారనుంది. భూసేకరణ జరిగి, ప్రభుత్వం నుంచి ఫ్లైఓవర్‌కు అనుమతి వచ్చే వరకు.. నూతన వంతెనకు ఇరువైపులా హైదరాబాద్ కరీంనగర్ రామగుండం(హెచ్‌కేఆర్) కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. అనుమతి రాగానే పనులు మొదలు పెట్టి నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఫ్లైఓవర్‌తోపాటు ఇరువైపులా వాహనాల కోసం రహదారి నిర్మిస్తారు. ఇందుకు భూ సేకరణ తప్పనిసరి. ఫలితంగా విలువైన భూములు, ఇళ్లు కూ ల్చివేయనున్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామ నడిబొడ్డున ఫ్లైఓవర్ పేరిట తమ విలువై న భూములు, ఇళ్లు కోల్పోయే పరిస్థితి తేవొద్దని అల్గునూర్ గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రా మంలో ఫ్లై ఓవర్ వద్దని పట్టుబడుతున్నారు. ఈ విషయమై ప్రభు త్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్‌డీసీ నోడల్ అధికారి వెంకటరామయ్య ఇటీవల నిర్వహిం చిన అభిప్రాయ సేకరణలో గ్రామస్తులు కుండబద్దలు కొట్టారు.
 
 అవసరమైతే సదాశివపల్లె నుంచి బైపాస్ వరకు ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్‌తో అల్గునూర్ రూపురేఖలు మారిపోతాయని, ఇళ్లకు బాగా నష్టం జరుగుతుందని వాపోయారు. దీనిపై స్పష్టత వచ్చేవరకు పనులు సాగనిచ్చేది లేదని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఇటీవల విచారణ నిమిత్తం గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి రాగా.. స్థానికులు ఈ విచారణను బహిష్కరించారు. దీంతో అసలు ఫ్లైఓవర్ నిర్మాణం సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 అల్గునూర్ చౌరస్తాలో ఆగిన లారీ
 తిమ్మాపూర్ : అల్గునూర్ చౌరస్తాలో లారీ నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది. బుధవారం ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలో డీజిల్ అయిపోవడంతో చౌరస్తాలో నిలిచిపోయింది. అక్కడే ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అంజయ్య, మంత్రి రాక కోసం ఎదురు చూస్తున్న ప్రొబేషనరీ ఎస్సై దేవేందర్, కానిస్టేబుల్ దుదియా నాయక్ వెంటనే స్పందించి వేరే లారీ సాయంతో పక్కకు జరిపించారు. దీంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. లేనిపక్షంలో మళ్లీ గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యేదని స్థానికులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు