‘ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటాం’

19 Nov, 2018 11:37 IST|Sakshi
అప్పిరెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, గుంటూరు : హాయ్‌లాండ్‌ వ్యవహారంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. వేలకోట్లు విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని, రెండు మూడు రోజుల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అప్పిరెడ్డి దీనిపై ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

నాలుగు నెలల్లో అధికారం చేజారుతుందని గ్రహించి ఈలోపే హాయ్‌లాండ్‌ను కొట్టేయాలని చూస్తున్నారని  ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపితే బాగోతం బయటపడుతుందని సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు జీవో జారీ చేశారని మండిపడ్డారు. బాధితులు బయపడ్డాల్సిన పనిలేదని.. తాము అండడా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు