జసిత్‌ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం

23 Jul, 2019 16:21 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కిడ్నాప్‌కు గురైన జసిత్‌ ఆచూకీ కోసం ఏడు పోలీసులు బృందాలు  గాలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం హస్మీ మంగళవారం బాలుడు కిడ్నాప్‌ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జసిత్‌ తండ్రి వెంకటరమణను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని చెక్‌ పోస్టులు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో అప్రమత్తం చేశామని, ఆర్థిక లావాదేవీలు కూడా కిడ్నాప్‌కు కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కచ్చితంగా చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదిస్తామన్న నమ్మకం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్స్‌ రాలేదని, కిడ్నాప్‌కు ముందే రెక్కి నిర్వహించి ఉంటారని అమామానిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

చదవండి: కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్‌

మరిన్ని వార్తలు