ఏటీఎంలో చోరీకి యత్నం.. అడ్డంగా దొరికిన మహిళ

20 Nov, 2017 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆదివారం, ఏటీఎం ఖాళీగా ఉంది, అదే అదునుగా ఓమహిళ అక్కడికు వచ్చింది. తను తెచ్చుకున్న వస్తువులతో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించింది. ఆసమయానికి స్థానికులు రావడంతో అడ్డంగా దొరికిపోయింది.

వివరాల్లోకి వెళ్తే నగరంలోని బందరు రోడ్డులో గేట్‌వే హోటల్ ఎదురుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ లో చోరీకి యత్నించిన మహిళను స్థానికులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి జనసంచారంలేని సమయంలో గుర్తుతెలియని మహిళ ఏటీఎంలోకి ప్రవేశించి చేతికి గ్లౌజ్‌లు తొడుక్కుని చోరీకి యత్నించింది. తన బ్యాగ్‌లో తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్లతో ఏటీఎంలోని విద్యుత్ వైర్లను కత్తిరించింది. అదే సమయానికి నగదు విత్ డ్రా కోసం ఏటీఎంకు వచ్చిన వ్యక్తులు ఆ మహిళను పట్డుకున్నారు.

ఆమె తెచ్చుకున్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా యాసిడ్ బాటిల్, కటింగ్ ప్లేయర్, కట్టర్, స్ర్కూడ్రైవర్ వంటి పరికరాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు మహిళను రామవరప్పాడువాసిగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు