కరోనాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం

30 Mar, 2020 20:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వృద్దురాలి మరణంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయింది. చోడవరం ద్వారకానగర్‌కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో‌ నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సహజ‌ మరణాన్ని ఇలా రాజకీయం చేయడం ఏంటని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు ఎల్లో మీడియాపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. (విశాఖ‌లో కోలుకున్న క‌రోనా బాధితుడు)

వృద్దురాలిది సహజ మరణం: ఆర్డీఓ
చోడవరం ద్వారకానగర్‌లోని వృద్దురాలిది సహజ మరణమని అనకాపల్లి ఆర్డిఓ సీతారామరాజు తెలిపారు. గత మూడు రోజులుగా వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. రేషన్ షాపుకు రాకుండానే రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయిందని చెప్పటం తప్పుడు ప్రచారమని అన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచెయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

వాస్తవాలను వక్రీకరించారు: ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరంలోని వృద్దురాలు షేక్ మీరాబి సహజంగానే మృతి చెందారని విశాఖ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. గత మూడు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. ఇంటి నుంచి బయలు దేరగానే పడిపోయిందని‌.. వెంటనే ఇంటికి తీసుకురాగా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. రేషన్ షాపు దగ్గరకు వెళ్లకుండానే  మార్గం మద్యలోనే ఆమె చనిపోయింది. వాస్తవాలను వక్రీకరిస్తూ రేషన్ కోసం ఎండలో నిలబడి ఎండ దెబ్బకు చనిపోయిందని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తప్పుడు వార్తలు ఇవ్వటం అన్యాయమని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే ఇటువంటి తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. (మీరూ ఒక జర్నలిస్టుగా పనిచేయండి)

అసత్య ప్రచారం చేస్తున్నారు: కొడాలి నాని
విశాఖపట్నం జిల్లా చోడవరంలో రేషన్ సరుకులు కోసం ఎండలో క్యూలో నిల్చుని వృద్ధురాలు మృతి చెందినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వృద్ధురాలు రేషన్ షాపు దగ్గర క్యూలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. రేషన్ సరుకులు కోసం ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, రేషన్ షాపు దగ్గర ప్రతి మనిషికి మూడు నిమిషాలు వ్యవధి పడుతుందన్నారు. రేషన్ సరుకులు ప్రతి రోజు సాయంత్రం వరకు షాపు వద్ద ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు