జనహోరు

4 Feb, 2018 07:49 IST|Sakshi

జన తరంగం కదం తొక్కింది. పల్లె రహదారులన్నీ ప్రజాసంకల్పయాత్ర వైపు మళ్లాయి. ఎటుచూసినా జనమే. మెండైన అభిమానం నిండిన యువత తరలిరాగా అశేష జనసంద్రం నడుమ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో సాగుతోంది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: మా కడగండ్లు నీవే తీర్చాలయ్యా.. అని అన్నదాతలు, అవ్వా తాతలు.. మా సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదు.. మా పక్షాన నీవే నిలిచి పోరాడాలన్నా..’’ అంటూ వివిధ సంఘాల నాయకులు జననేతకు సమస్యలను విన్నవించి, వినతిపత్రాలు అందజేస్తున్నారు. ప్రతి సమస్యను ఆసాంతం విని అందరికీ భరోసా నింపుతూ.. అధైర్యపడొద్దని చెబుతూ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సాగిస్తున్నారు. అశేష జనసంద్రం నడుమ 78వ రోజు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని మరుపూరులో ప్రారంభమై పాలిచర్లపాడు క్రాస్‌రోడ్డుతో సర్వేపల్లి నియోజకవర్గంలో యాత్ర ముగియగా అక్కడ నుంచి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని మట్టెంపాడులోకి ప్రవేశించింది. శనివారం జననేత 12 కి.మీ. యాత్ర కొనసాగించి సౌత్‌మోపూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

యాత్ర కొనసాగిందిలా..
శనివారం ఉదయం పొదలకూరు మం డలంలోని మరుపూరులో ప్రజాసంక  ల్పయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి పాలిచర్లపాడు క్రాస్‌రోడ్డుకు చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేతను కలిసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ ముత్తుకూరు గ్రామానికి చెందిన శేషమ్మ అనే మహిళ జగన్‌తో తన గోడును వెలిబుచ్చుకున్నారు. తన తాత మూడునెలల కిందట విద్యుత్‌షాక్‌తో  మరణించాడనీ అయితే నేటివరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తంచేసింది. అక్కడే నియోజకవర్గానికి చెం దిన పలువురు రైతులు జననేతను కలిసి సాగునీటి ఇబ్బందులు విన్నవించారు. సంగం నుంచి కనుపూరు కాలు వ ఆధునికీకరణ పనులు వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభం అయ్యాయని.. ఆ మహానేత మరణా నంతరం పాలకులు శ్రద్ధ పెట్టకపోవడంతో పూర్తికాకక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమశిల జలాశయంలో నీరుపుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టుకు అందక పం టలు ఎండిపోతున్నాయని చెప్పారు. అక్కడే ఎపీఎస్‌ఆర్టీసి కాంట్రాక్టు ఉద్యోగులు కొంద రు జననేతను కలసి బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకోసం 2016లో శిక్షణ ఇచ్చారనీ అయితే ఇంతవరకూ ఉద్యోగాల్లోకి తీసుకోకపొవడంతో తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని  ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి నుంచి నెల్లూ రు రూరల్‌ నియోజకవర్గంలోని మట్టెంపాడుకు చేరుకున్న జగన్‌కు నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి ఆయన వెంట నడిచాయి. అనంతరం అక్కడే నేషనల్‌ టీబి కం ట్రోల్‌ ప్రోగాం కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియ నేత కె.నరసింహులుతో పాటు మరికొందరు కలిసి ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు ఇతర సమస్యలను పరి ష్కరించాలని జగన్‌మోహన్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడే పులివెందుల నియోజకవర్గానికి పేరమ్మ అనే మహిళ జననేతను కలిసింది.

రూ.లక్ష పంట రుణం తీసుకుంటే రూ 17,490కు బాండ్‌ వచ్చిందని అయితే బ్యాంకులకు వెళ్లితే ఒక్క రూపాయి కూడా జమకాలేదని చెప్పారని గోడు వెలి బుచ్చింది. అనంతరం మొగళ్లపాలెం చేరుకున్న జగన్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏపీ ట్రామాకేర్‌ సెంటర్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూని యన్‌ నేతలు కలిసి కనీస వేతనం లేదని ఆవేదన వ్యక్తం చేసి వినతిపత్రం సమర్పించారు. అక్కడే మన్నవరం ఆదిలక్ష్మి అనే మహిళ కలి సి మూడు నెలల కిందట తన భర్త చనిపోతే నేటికీ చంద్రన్నబీమా పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తంచేసింది. అక్కడే వైఎస్‌ఆర్‌సీపి విద్యార్థి విభాగం జిల్లా అ«ధ్యక్షులు శ్రావణ్‌ విక్రమ సింహపురి యూనివర్శిటి నిర్వహణ లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయ ని, యునివర్శిటీ పాలన అస్తవ్యస్తంగా ఉంద ని జననేతకు వినతిపత్రం అందజేశారు.

ముఖ్యనేతలు హాజరు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థనరెడ్డి, కిలి వేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి. అనీల్‌ కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  పార్టీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పి.రూప్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సింహపురి వర్సిటీ బాబు పాలనకు నిదర్శనం
సౌత్‌మోపూరు బహిరంగసభలో జననేత జగన్‌మోహన్‌ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ మహానేత వైఎస్‌ఆర్‌ ఏర్పాటు చేశారనీ అయితే ప్రస్తుతం దాని పరిస్థితి చంద్రబాబు అధ్వాన్న పాలనకు అద్దం పడుతోందన్నారు. వర్సిటీలో 200టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు భర్తీచేయకుండా అధికా రంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిపై పడ్డారని, దీంతో వారు కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఉత్పన్నమైందన్నారు. అలాగే విలీన గ్రామల్లో కనీస అభివృద్ధి జరగలేదని, నెల్లూరు రూరలోని ఆటోనగర్‌లో పూర్తి వసతులు లేవని ఇలా అన్నింటిని సర్కారు నిర్లక్ష్యం చేసిం దని ధ్వజమెత్తారు. అనంతరం గుడిపల్లిపాడుకు చెందిన టీడిపీ నాయకులు రామ్మోహన్, నెల్లూరు నగరానికి చెందిన దిలీప్‌రెడ్డి వేర్వేరుగా జననేత సమక్షంలో పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు