ఆ పేరే.. ఓ ధైర్యం

20 Jun, 2018 06:43 IST|Sakshi

పాదయాత్రలో కుటుంబ సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు 

కష్టాలు వింటూ.. భవిష్యత్తుపై భరోసా ఇస్తున్న వైఎస్‌ జగన్‌ 

ఉద్వేగానికిలోనై కంటనీరు పెట్టుకుంటున్న అక్కచెల్లెమ్మలు 

అడుగడుగునా వివిధ వర్గాల వినతిపత్రాలు 

జిల్లాలో ఏడో రోజు ప్రజా సంకల్పయాత్ర

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఈ పేరు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్నిస్తోంది. బాధల్లో ఉన్నవారికి భరోసానిస్తోంది. అనారోగ్యంతో ఉన్న వారికి జీవితంపై ఆశ కల్పిస్తోంది. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు తమ కుటుంబ కష్టాలను చెప్పుకుంటూ ఊరట పొందుతున్నారు. త్వరలో తమ కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ఉద్వేగానికిలోనైన వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 

సాక్షి, రాజమహేంద్రవరం: ఎంతోకాలంగా తమ గుండెల్లో దాచుకున్న కష్టాలను వినేందుకు రాజన్న బిడ్డ వచ్చాడని, ఆయనను చూసేందుకు, కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు కోనసీమ గ్రామాలు కదలి వస్తున్నాయి. పాదయాత్ర సాగే రహదారికి దూరంగా లంకల్లో ఉన్న గ్రామాల అక్కచెల్లెళ్లు, అవ్వాతాతలు, దంపతులు తమ బిడ్డలతో రోడ్డు మధ్యకు చేరుకుంటున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తూ తమ అభిమాన నేతను కళ్లారా చూస్తున్నారు. గ్రామాల్లోని మహిళలు హారతులు పడుతున్నారు. గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు. యువతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు యువనేతతో సెల్ఫీలు దిగిన అనంతరం తమ మొబైళ్లలో ఆ ఫొటోలను అపురూపంగా చూసుకుంటున్నారు.

పాదయాత్ర సాగిందిలా...
కోనసీమకు జీవనాడైన గోదారమ్మ పి.గన్నవరంలో పచ్చనిసీమకు అందాలద్దేలా వశిష్ట, వైనతేయ నదులుగా విడిపోయిన ప్రాంతం నుంచి మంగళవారం జిల్లాలో ఏడో రోజు పాదయాత్ర 10 కిలోమీటర్ల మేర సాగింది. పి.గన్నవరం నుంచి ఉదయం 8:45 గంటలకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ గ్రామ శివారులో వైనతేయ నదిపై నిర్మించిన బ్రిడ్జి నుంచి నడుస్తుండగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనతో అడుగు కలిపారు. వైనతేయ నదిని దాటి లంకల గన్నవరం, జొన్నల్లంక, మొండిపలంకలో భోజన విరామం వరకు పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి ప్రారంభమైన పాదయాత్ర కండలపాలెం, నాగుల్లంకల మీదుగా సాగింది. రాత్రి బస కేంద్రానికి సాయంత్రం 5:30 గంటలకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ను పలువురు నేతలు కలిశారు. 

పాదయాత్రలో పార్టీ శ్రేణులు...
పాదయాత్రలో ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, కె. నారాయణస్వామి, షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి కొప్పున మోహనరావు, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, గుత్తుల నాగబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడ్డగల సాయిరామ్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి వెంకట శివరామన్, వాసంశెట్టి తాతాజీ, నీతిపూడి విలసిత మంగతాయారు, ఎస్‌.శివప్రకాశ్‌రాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు మెల్లం మహాలక్ష్మి ప్రసాద్, నేతల నాగరాజు, వరసాల ప్రసాద్, రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శులు పితాని నరసింహారావు, దొమ్మేటి సాయికృష్ణ, చింతా రామకృష్ణ, ముత్తాబత్తుల మణిరత్నం, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులు యన్నబత్తుల ఆనంద్, పేర్ని శ్రీనివాసరావు, సేవాదళ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల కొండలరావు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకర్‌రావు, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొర్లపాటి కోటబాబు, జిల్లా యువజన, విద్యార్థి అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్, జక్కంపూడి కిరణ్, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కాశి మునికుమారి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, పితాని నరసింహారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మంతెన రవిరాజు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కసిరెడ్డి అంజిబాబు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు కుడిపూడి సత్తిబాబు, మట్టిపర్తి సోమేశ్వరరావు, మైలా ఆనందరావు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా సేవాదళ్‌ కార్యదర్శి నల్లమిల్లి గోవిందరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మేటి శివరాం, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి మండలాల కన్వీనర్లు కొమ్ముల రామచంద్రరావు, నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి శ్రీనివాస్, సీనియర్‌ నాయకులు ఎం.ఎం.శెట్టి,  కర్రిపాపారాయుడు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం నేతలు గుర్రం గౌతమ్, జక్కంపూడి వాసు, సుభాష్‌చంద్రబోస్, దేశాల శ్రీను, నీలి ఆనంద్‌కుమార్, బోస్, మురముళ్ల సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు