విజయమ్మ పరామర్శ నేడు

16 Oct, 2013 06:36 IST|Sakshi

కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో పర్యటన
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రచండ పై-లీన్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైన జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నాయి. బుధవారం ఉద యం విజయమ్మ హైదరాబాద్‌లో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం వస్తారు. అక్కడి నుంచి 9.30  శ్రీకాకుళం సింహద్వారం వద్దకు చేరుకుంటారు. స్థానిక నాయకులతో కలసి అక్కడి నుంచి నేరుగా కంచిలి వెళ్తారు. ఆ మం డలంలోని పెద్దకొజ్జిరియా, జాడుపూడి ప్రాం తాల్లో పర్యటిస్తారు. అనంతరం కవిటి మం డలం రాజపురం, జగతి, ఇద్దివానిపాలెంతోపాటు అదే మండలంలోని కళింగపట్నం వె ళ్తారు. అక్కడి నుంచి సోంపేట మండలం ఇసుకలపాలెం చేరుకొని అటు తరువాత తలతంపర మీదుగా బారువ వెళ్తారు. ఆయా ప్రాం తాల్లో తుఫాన్ నష్టాలను పరిశీలించడంతోపా టు బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాల ను స్వయంగా అడిగి తెలుసుకుంటారు.  అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళతారు.
 
 విజయవంతం చేయండి : కృష్ణదాస్
 రిమ్స్‌క్యాంపస్: తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులను కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సూచనల మేరకు జిల్లా పార్టీ నాయకులంతా కలసి బాధిత ప్రాంతాల్లో పర్యటించామని, అక్కడి ప్రజల కష్టాలను ఆయనకు తెలియజేయగా విజయమ్మను జిల్లాకు పంపుతున్నారని వివరించారు. తుఫాన్ దాటికి తీవ్ర నష్టం వాటిల్లి ప్రజలు నానావస్ధలు పడుతుంటే, వారిని అదుకోవటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్ర మంత్రుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించినా కనీసం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని అన్నారు.  
 
 కవిటికి వెళ్లిన మంత్రి కొండ్రు మురళీ అసలు ఇక్కడేమీ నష్టం జరగలేదని వ్యాఖ్యానించడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టెక్కలి డివిజన్‌లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. బాధిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నట్టు లేదన్నారు. బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయటం పట్ల వై.ఎస్.ఆర్ సీపీ ముందుండి నిల్చుంటుందని చెప్పారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, ఆమదాలవలస, ఎచ్చెర్ల సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, గొర్లె కిరణ్‌కుమార్, జిల్లా అడ్‌హాక్ కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు ధర్మాన ఉదయ్ భాస్కర్, రాష్ట్ర సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు