జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వైఎస్సార్‌ జ్ఞాపకాలు

15 Nov, 2018 07:59 IST|Sakshi
మహానేత వైఎస్సార్‌ జ్ఞాపకాల చిత్రమాలికను జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సింహాచలం

విజయనగరం :సంక్షేమ పాలన అందించడంలో ప్రపంచ స్థాయిలో ఖ్యాతినార్జించిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన కార్యక్రమాలను ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో మారు నెమరవేసుకున్నారు. బొబ్బిలి మండలంలోని మెట్టవలస గ్రామానికి చెందిన చింతాడ సింహాచలం దివంగత ముఖ్యమంత్రి  చేపట్టిన పథకాలను దృశ్యమాలికగా మలిచి జగన్‌మోమన్‌రెడ్డికి అందజేశారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సీతానగరం మండలంలోని అప్పయ్యపేట వద్ద భోజన విరామ శిబిరంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 2003లో మహానేత వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్ర చిత్రాలను, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో రాష్ట్రంలో ఆయన పర్యటించి అమలు చేసి, ప్రారంభించిన చిత్రాలను జననేతకు చూపించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, అందుకనే ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ సంబంధించిన చిత్రాలను దాచిపెట్టి ఆ జ్ఞాపకలను ఎప్పటికప్పుడు అందరికీ చూపిస్తున్నట్లు సింహాచలం చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరల రాజన్నరాజ్యం వస్తుందన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు