వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల జాబితా విడుదల

11 Mar, 2014 18:43 IST|Sakshi
తోట చంద్రశేఖర్

ఏలూరు: ఏలూరు మునిసిపల్  కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసే వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల తొలిజాబితాను ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 46 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. స్థానిక  సంస్థల ఎన్నికల్లో  వైఎస్ఆర్ సీపీదే విజయం అని చంద్రశేఖరరావు చెప్పారు.

ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధత వల్లే ఒకేసారి ఎన్నికలు వచ్చాయన్నారు. ఏలూరు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను వైఎస్ఆర్ సిపి  కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు