‘వైఎస్సార్‌ సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు’

1 May, 2019 18:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : గుంతకల్లు డీఎస్పీ.. తెలుగుదేశం పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్‌ సీపీ నేతలను ఇబ్బందిపెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత గౌతంరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. బుధవారం సీఈఓ ద్వివేదీని కలిసిన ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ రోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రత పెంచాలని కోరారు. ఆర్వో, పీఓలతోపాటు డీఎస్పీని ఎన్నికల విధులనుంచి తొలగించి కౌంటింగ్ నిస్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు