అధికారపార్టీ ఆగడాలకు అంతం లేదా?

9 Nov, 2014 02:01 IST|Sakshi
అధికారపార్టీ ఆగడాలకు అంతం లేదా?

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

పామర్రు : అధికార పార్టీ నేతల అరాచకాలు, ఆగడాలు రోజు రోజుకు   ఎక్కువవుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ కొమరవోలు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తాను పాల్గొన్నప్పటికీ తనకు, గ్రామ సర్పంచి పొట్లూరి కృష్ణకుమారికి కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు స్థానిక టీడీపీ నేతల వత్తిడితో పశువైద్యశాలను ప్రారంభించడం తమను అవమానించడమేనని చెప్పారు.

దీనికి   టీడీ పీ నేత వర్ల రామయ్య, పొట్లూరి కృష్ణబాబు  బాధ్యత వహించాలన్నారు. తాము జన్మభూమి కార్యక్రమం ముగించుకుని వెళ్లిన తర్వాత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలతో కలిసి ప్రారంభించడం వారి  కుసంస్కారానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర మంత్రి కూడా స్థానిక ఎమ్మెల్యే లేకుండా ప్రారంభోత్సవం చేయడం విచారకర  మని  ఎమ్మెల్యే కల్పన విమర్శించారు.
 

మరిన్ని వార్తలు