తహశీల్దార్‌, ఎంపీడీవో నిర్భందం.. ఉరవకొండలో ఉద్రిక్తత

18 Jun, 2018 14:34 IST|Sakshi
ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌ సీసీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

సాక్షి, అనంతపురం : ఉరవకొండ తహశీల్దార్‌, ఎంపీడీవో, హౌంసింగ్‌ సిబ్బందిని ఆందోళనకారులు నిర్భంధించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. సోమవారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌ సీసీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణతో అసంతృప్తి చెందిన ఆందోళనకారులు వారిని నిర్భందించారు.

ఇళ్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు
ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేని అసమర్థుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఉరవకొండలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు కట్టించారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఉరవకొండ పట్టణంలో 89 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు.

ఆయన కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉరవకొండలో పయ్యావుల బ్రదర్స్‌ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని హితవుపలికారు. 
 

మరిన్ని వార్తలు