గ్రహం అనుగ్రహం (28-08-2019)

28 Aug, 2019 06:42 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి బ.ద్వాదశి రా.11.04 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం పునర్వసు రా.10.54 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం ఉ.11.20 నుంచి 12.54 వరకు,దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.51 నుంచి 11.36 వరకు, అమృతఘడియలు..రా.8.35 నుంచి 10.06 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం :  ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.

వృషభం: సన్నిహితులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు పూర్తి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

సింహం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం.

తుల:పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తిలాభం. సోదరులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

వృశ్చికం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

ధనుస్సు:సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి. కీలక నిర్ణయాలు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో మరిన్ని ఒత్తిడులు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు