గ్రహం అనుగ్రహం (09-11-2019)

9 Nov, 2019 06:03 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుకార్తీక మాసం, తిథి శు.ద్వాదశి ప.1.54 వరకు, తదుపరిత్రయోదశి నక్షత్రం ఉత్తరాభాద్ర ప.3.10 వరకు, తదుపరి రేవతి వర్జ్యం తె.4.24 నుంచి 6.02 వరకు (తెల్లవారితే ఆదివారం) దుర్ముహూర్తం ఉ.6.04 నుంచి 7.34 వరకు, అమృతఘడియలు... ఉ.9.51 నుంచి 11.02 వరకు, క్షీరాబ్ది ద్వాదశి.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  5.23
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమార్పులు.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కన్య: ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

తుల: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కీ లక నిర్ణయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ప నుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటి గా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. దైవదర్శనాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

మీనం: ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పా ల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విం దువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు