గ్రహం అనుగ్రహం (13-12-2019)

13 Dec, 2019 05:48 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.31 వరకు తదుపరి విదియ, నక్షత్రం మృగశిర ఉ.7.28 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం ప.3.49 నుంచి 5.23 వరకు, దుర్ముహూర్తం ఉ.8.35 నుంచి 9.19 వరకు, తదుపరి ప.12.15 నుంచి 1.01 వరకు, అమృతఘడియలు... రా.9.23 నుంచి 10.43 వరకు.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం:    పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు.

మిథునం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహనాలు, భూములు కొంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. పనులు చకచకా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో  బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయదర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు