పసిడికి డాలర్‌ ‘బులిష్‌’ షాక్‌

2 Oct, 2017 00:48 IST|Sakshi

వారంలో పసిడి 12 డాలర్లు  డౌన్‌!
అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, ఫెడ్‌ ఫండ్‌ రేటు (అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఇస్తున్న సంకేతాలు పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర  29వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 12 డాలర్లు నష్టపోయింది. 1,286 డాలర్ల వద్ద ముగిసింది. అయితే  దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు.  

దేశీయంగా పండుగల డిమాండ్‌
వారం వారీగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత (65.34), నైమెక్స్‌లో  తగ్గిన బంగారం స్పీడ్‌ వంటి అంశాలు దేశీయంగా ప్రభావం చూపినా, వారం వారీగా ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో పసిడి పూర్తి నష్టాల్లోకి జారలేదు. దేశీయంగా పండుగ సీజన్‌ డిమాండ్‌ ఇందుకు ఒక కారణం.   ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.70 పెరిగి రూ.29,845కి చేరింది.

మరిన్ని వార్తలు