Sakshi News home page

"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..

Published Tue, Sep 12 2023 12:33 PM

This Man Turned An Airplane Into His Home  - Sakshi

ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!.

అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ బ్రూస్‌ క్యాంపెబెల్‌కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్‌ ఉంది. హెయిర్‌ స్టయిలిస్ట్‌ జాన్‌ ఉస్సేరీ.. బోయింగ్‌ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్‌కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది.

అందుకోసం క్యాపెంబెల్‌ ఒరెగాన్‌లోని హిల్స్‌బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్‌ ఎయిర్‌వేస్‌ నుంచి బోయింగ్‌ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్‌లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్‌బెల్‌. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్‌బెల్‌. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు.

ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్‌ మిషన్‌, షింక్‌ వంటివి, కిచెన్‌కి కావల్సిన ఇంటీరియర్‌ డిజైన్‌ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్‌ వంట చేసేందుకు మైక్రోవేవ్‌, టోస్టర్‌ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్‌ప్లేన్‌ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్‌లా ప్లేన్‌హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ.

(చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్‌ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు)

Advertisement

What’s your opinion

Advertisement