360 డిగ్రీల ఫేస్‌ వీడియో

14 Apr, 2016 17:16 IST|Sakshi
360 డిగ్రీల ఫేస్‌ వీడియో

సోషల్‌ నెట్‌ వర్క్‌ దిగ్గజం ఫేస్‌ బుక్‌ ఓ కొత్తరకం చాట్‌బాట్లను ప్రజల ముందుకు  తెచ్చింది. ఫేస్‌ బుక్‌ ఆవిష్కరించిన ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ బాట్ల వల్ల ప్రస్తుతం మనం వాడుతున్న మెసెంజర్‌ యాప్‌ లో యూజర్లు సంప్రదింపులు జరపడం, అప్‌డేట్స్‌ తెలుసుకోవడం జరుగుతుంది. బిజినెస్‌ లకు సంబంధించిన విలువైన సమాచారం యూజర్లకు తెలియజేయడంతోపాటు అవి కూడా ఉపయోగకరరీతిలో ఉండేలా ఈ చాట్‌ బాట్లను వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో రూపకల్పన చేసింది.

అలాగే 360 డిగ్రీల స్టీరియోస్కోపిక్‌ 3డీ వీడియో కెమెరాను శాన్‌ ప్రాన్సిస్కోలో జరిగిన రెండు రోజుల ఎఫ్‌8 డెవలపర్ల సదస్సులో ఫేస్‌ బుక్‌ విడుదల చేసింది. ఈ 3డీ వీడియో కెమెరాకు ఫేస్‌ బుక్‌ సరౌండ్‌ 360గా నామకరణం చేసింది. ఈ కెమెరా ద్వారా తీసే వీడియో క్లారిటీ ఎక్కువగా ఉంటూ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనిని తగ్గిస్తాయని కంపెనీ పేర్కొంది.

కానీ ఈ కెమెరాలను అమ్మదలుచుకోలేదని ఫేస్‌ బుక్‌ తెలిపింది. ఈ డిజైన్‌ ను షేర్‌ మాత్రమే చేసి ఇతర సంస్థలు ఇలాంటి కెమెరాలు రూపొందించే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పింది. సమాంతరంగా అమర్చిన 17  లెన్స్‌లతో 30వేల డాలర్లకు ఫేస్‌ బుక్‌ తయారుచేసింది. ఇది 360 డిగ్రీల స్టీరియోస్కోపిక్‌ వీడియోను తీసే కెపాసిటీని కల్గి ఉంది. ట్విట్టర్, స్నాప్‌ చాట్, యూట్యూబ్‌ వీడియోలతో పోటీ పడే విధంగా ఈ వీడియో కెమెరాను రూపొందించామని ఫేస్‌ బుక్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు