అమెజాన్‌ కీలక నిర్ణయం: 20 సెంటర్లు, భారీ ఉద్యోగాలు

19 Jan, 2018 10:59 IST|Sakshi

వాషింగ్టన్‌:  ఇ-కామర్స్  దిగ్గజం  అమెజాన్‌ సంస్థ  కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున విస్తరించేందుకు రచిస్తున్న ప్రణాళికల్లో వేగం పెంచింది.  ఇందులో  భాగంగా తాను ఏర్పాటు చేయనున్న కొత్త కార్యాలయాల జాబితాను వెల్లడించింది.  అమెరికా ప్రధాన  మెట్రో నగరాలు న్యూ యార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీతో పాటు ముఖ్యంగా నార్త్ కరోలినా, కొలంబస్, ఒహియో  లాంటి చిన్న నగరాల్లో కూడా అమెజాన్‌ సెకండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
 
కెనడాలోని  ఓ ప్రధాన నగరం సహా  20 ముఖ్య నగరాల్లో అమెజాన్‌ కార్యాలయాలను ప్రారంభించనుంది.  238 ప్రతిపాదనలను సమీక్షించిన తర్వాత అమెజాన్‌ ఎంపిక చేసిన నగరాల జాబితాను గురువారం విడుదల చేసింది.  5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులతో ఈ  సెంటర్లను ఏర్పాటు చేయనున్నామనీ,  తద్వారా సుమారు 50వేల ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని అమెజాన్‌  ప్రకటించింది

అమెరికా, కెనడా, మెక్సికో దేశాల నుంచి 238 సెంటర్లను పరిశీలించిన అమెజాన్‌ చివరికి ఈ ఎంపిక చేసింది. టెక్నాలజీ హబ్‌గా ఎస్టాబ్లిష్‌ అయిన బోస్టన్‌, పిట్స్‌బర్గ్‌ సహా కొలంబియా, ఓహియా నగరాలు ఈ  జాబితాలో ఉండటం విశేషం. అమెరికా బయట కెనడా అతిపెద్ద నగరం టొరాంటో ఈ జాబితాలో ఉంది.
 

మరిన్ని వార్తలు