మెస్సీ నాకు ఫీజు చెల్లించాలి! : మహీంద్ర

27 Jun, 2018 08:43 IST|Sakshi
ఆనంద్‌ మహీంద్ర, లియోనల్‌ మెస్సీ (పాత చిత్రం)

ముంబై : ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లో తప్పక గెలవాల్సిన కీలక పోరులో లియోనల్‌ మెస్సీ టీమ్‌ అర్జెంటీనా విజయం సాధించింది. అయితే స్టార్‌ ప్లేయర్‌ మెస్సీ గోల్‌ చేయడంపై ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. తరచుగా సోషల్‌ మీడియాలో కామెంట్లతో పలు విషయాలు షేర్‌ చేసుకునే మహీంద్ర.. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో తనకు నచ్చిన విషయాలపై ట్వీట్లు చేస్తూ తన ఫాలోయర్లకు వినోదాన్ని పంచుతున్నారు.

‘ఈ వరల్డ్‌కప్‌ చూడటం ఓ అదృష్టంగా భావిస్తాను. ఎంతో ఉత్సాహంగా ఉన్న నేను నైజీరియాతో అర్జెంటీనా మ్యాచ్‌ చూస్తూ మధ్యలోనే చాలా అలసిపోయాను. బోర్‌ కొడుతుందని ఇక టీవీ ఆఫ్‌ చేద్దామని రిమోట్‌ అలా పట్టుకున్నానో లేదో అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సీ మ్యాజిక్‌ (గోల్‌) చేశాడు. రిమోట్‌ను చేతిలోకి తీసుకోవడం అలవాటుగా చేసుకుంటానని’ మహీంద్ర తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

‘సార్‌.. మీ రిమోట్‌ టెక్నిక్‌ మరోసారి ప్రయోగించండి’ అని ఫ్లై బాయ్‌ అనే నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు మెస్సీ నాకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆనంద్‌ మహీంద్ర చమత్కరిస్తూ రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మహీంద్ర ట్వీట్లు వైరల్‌గా మారాయి. కాగా, ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు