ఐవోటీ సేవల్లోకి ‘అడాగ్’

16 Nov, 2016 01:07 IST|Sakshi
ఐవోటీ సేవల్లోకి ‘అడాగ్’

సిస్కోతో జట్టు కట్టిన అనిల్ అంబానీ గ్రూపు

ముంబై: సిస్కో జాస్పర్ భాగస్వామ్యంతో అనిల్ అంబానీ గ్రూపు (అడాగ్) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐవోటీ/ఇంటర్నెట్ ఆధారిత పరికరాల) సేవలను ‘అన్‌లిమిట్’ పేరుతో మంగళవారం ముంబైలో ప్రారంభించింది. ఈ వెంచర్ కింద దేశవ్యాప్తంగా కంపెనీలకు ఐవోటీ సేవలు అందించనుంది. ఇందు కోసం సిస్కో జాస్పర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో ఐవోటీ సేవలకు అవకాశాలు అపరిమితమని అడాగ్ ఎండీ అమితాబ్ జున్‌జున్‌వాలా ఈ సందర్భంగా అన్నారు.

ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాలు 20 కోట్ల నుంచి 2020 నాటికి 300 కోట్లకు, మార్కెట్ రూ.37 వేల కోట్ల స్థారుు రూ.లక్ష కోట్లకు వృద్ధి చెందే అవకాశాలున్నాయని చెప్పారు. అన్‌లిమిట్ దేశంలో స్మార్ట్ సిటీ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తుందని అడాగ్ గ్రూప్ పేర్కొంది. భారత వృద్ధిలో ఐవోటీ కీలకమని ‘అన్‌లిమిట్’ సీఈవో జుర్గెన్‌హేస్ పేర్కొన్నారు. సిస్కో జాస్పర్‌కు ప్రపంచ వ్యాప్తంగా 120 మొబైల్ నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యం ఉన్నందున దేశీయ కంపెనీలు తమ సేవలను ఇతర దేశాలకు విస్తరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌లో ఐవోటీ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు టాటా గ్రూపు జీఈ, మైక్రోసాఫ్ట్‌తో జట్టుకట్టడం తెలిసిందే.

మరిన్ని వార్తలు