సీఈవో 'పూర్' కామెంట్స్: స్పందించిన కంపెనీ

18 Apr, 2017 09:31 IST|Sakshi
సీఈవో 'పూర్' కామెంట్స్: స్పందించిన కంపెనీ
సీఈవోపై ఆరోపణలను ఖండిస్తున్న స్నాప్ చాట్
న్యూయార్క్ : భారత్, స్పెయిన్ మార్కెట్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన  ఆరోపణలపై కంపెనీ స్పందించింది. కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి, సీఈవోపై చేస్తున్న ఆరోపణలను స్నాప్చాట్ కొట్టిపారేసింది. తమ మల్టిమీడియా మొబైల్ యాప్ ప్రతిఒక్కరికీ అంటూ సీఈవోను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ ఎల్లవేళలా భారత యూజర్లకు ''కృతజ్ఞత'' భావంతో ఉంటుందని పేర్కొంటోంది.
 
''  స్నాప్చాట్ ప్రతిఒక్కరికీ! ఉచితంగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులో ఉంది'' అని కంపెనీ అధికారప్రతినిధి ఓ ప్రకటించారు. కంపెనీ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియాన్ చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్నాప్ చాట్ యాప్ కేవలం ధనిక వ్యక్తులకేనని, భారత్, స్పెయిన్ లాంటి పేదదేశాలకి విస్తరించాలనుకోవడం లేదని స్పీగల్ వ్యాఖ్యానించినట్టు మాజీ ఉద్యోగి ఆరోపించారు.
 
స్పీగల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు వెలువడగానే, కంపెనీపై యూజర్లు మండిపడుతున్నారు. ట్విట్టర్లో స్నాప్ చాట్ పై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. చాలామంది ఇప్పటికే తమ స్నాప్ చాట్ యాప్ ను అన్ఇన్స్టాల్ చేసి, బాయ్ కాట్కు పిలుపునిచ్చారు. కొంతమంది తెలియక, స్నాప్ చాట్ బదులు స్నాప్ డీల్ ను అన్ఇన్స్టాల్ చేశారు. 
మరిన్ని వార్తలు