ఐఫోన్‌ యూజర్లకు యూఐడీఏఐ మెసేజ్‌

30 Jan, 2018 14:14 IST|Sakshi
ఐఫోన్‌ యూజర్లకు త్వరలో 'ఎంఆధార్‌' యాప్‌

న్యూఢిల్లీ : దేశంలో డిజిటైజేషన్‌ పెంచడానికి ఆధార్‌ ఏజెన్సీ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆరు నెలల క్రితం 'ఎంఆధార్‌' యాప్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో లాంచ్‌ చేసిన ఈ యాప్‌ను ఆధార్‌ ఏజెన్సీ కేవలం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌ను త్వరలో ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రాబోతుంది. ఎంఆధార్‌ యాప్‌ ఐఓఎస్‌ వెర్షన్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నామని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషన్‌ పాండే తెలిపారు. త్వరలోనే ఈ యాప్‌ను ఐఓఎస్‌ యూజర్లకు లాంచ్‌ చేయబోతున్నట్టు పాండే ఓ షార్ట్‌ వీడియోలో పేర్కొన్నారు.

అయితే లాంచింగ్‌ తేదీని మాత్రం పాండే తెలుపలేదు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పాండే ఈ వీడియోను విడుదల చేశారు. ఆధార్‌ డేటా దొంగతనంపై ఇటీవల వస్తున్న రిపోర్టు, ఆధార్‌ యాప్‌ భద్రతపై కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు అందించే ఫీచర్లనే ఐఓఎస్‌ వెర్షన్‌కు అందించనున్నారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు ఆధార్‌తో మొబైల్‌ నెంబర్‌ను రిజిస్ట్రర్‌ చేయాల్సి ఉంటుంది. ఎంఆధార్‌ను అపరిచితులు ఓపెన్‌ చేయకుండా బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ను ఏర్పాటుచేశారు. బయోమెట్రిక్‌ డేటాను లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకోవడానికి యూజర్లకు ఎంఆధార్‌ యాప్‌ సహకరించనుంది. 

మరిన్ని వార్తలు