యాక్సిస్‌ బ్యాంకు కూడా తగ్గించేసింది

8 Aug, 2017 16:16 IST|Sakshi
యాక్సిస్‌ బ్యాంకు కూడా తగ్గించేసింది

ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్‌ బ్యాంకు కూడా వడ్డీరేటులో  కోత పెట్టింది.  అంచనాలకనుగుణంగానే యాక్సిస్‌ కూడా వడ్డీరేటును  తగ్గిస్తున్నట్టు మంగళవారం  ప్రకటించింది. సేవింగ్‌ ఖాతాలపై  చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్‌ పాయింట్లను తగ్గించింది.   దీంతో  ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది.

 పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును  యాక్సిస్‌ బ్యాంక్‌  అర శాతం తగ్గించింది.  3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల  వరకు  వరకు నిల్వ (బ్యాలెన్స్‌) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది.  రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. 
కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో  పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా కూడా సేవింగ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల  (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు