బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 42% వృద్ధి

20 Jul, 2017 00:37 IST|Sakshi
బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 42% వృద్ధి

క్యూ1లో రూ. 602 కోట్లు
రూ. 4,500 కోట్ల సమీకరణకు షేర్‌హోల్డర్లు ఓకే


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 42 శాతం ఎగిసి రూ. 602 కోట్లుగా నమోదైంది. 2016–17 ఏప్రిల్‌–జూన్‌ వ్యవధిలో లాభం రూ. 424 కోట్లే. ఇక తాజాగా ఆదాయం సైతం 39 శాతం వృద్ధి చెంది రూ. 2,282 కోట్ల నుంచి రూ. 3,165 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

డెట్‌ సెక్యూరిటీస్‌ జారీ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు సమీకరించే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. గతేడాది జూన్‌ ఆఖరు నాటికి రూ. 49,608 కోట్లుగా ఉన్న బజాజ్‌ ఫైనాన్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి 39 శాతం పెరిగి రూ. 68,883 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సంస్థ షేరు ధర సుమారు 2 శాతం లాభంతో రూ. 1,543 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు