బ్యాంకులకు వరుస సెలవులు.. ఏటీఎంలలో సందడి

14 Mar, 2016 18:41 IST|Sakshi
బ్యాంకులకు వరుస సెలవులు.. ఏటీఎంలలో సందడి

న్యూఢిల్లీ: సాధారణంగా బ్యాంకులకు ఒకటి రెండు రోజులు సెలవులు వస్తేనే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ మార్చిలో వరుసగా నాలుగు రోజులు  సెలవులు వస్తున్నాయి.  మార్చి 24 నుంచి 27 వరకు  బ్యాంకులకు సెలవులు  కావడంతో  బ్యాంకింగ్ కార్యకలాపాలకు కాస్త  విరామం రానుంది.  ఈ నేపథ్యంలో  వినియోగదారులు ముందుగానే  జాగ్రత్త పడి ఏటీఎంలపై వైపు పరుగులు తీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

వరుస సెలవుల కారణంగా జాగ్రత్తగా నగదు నిల్వకు బ్యాంకులు ప్లాన్ చేయకపోతే వినియోగదారులకు సమస్యలు తప్పవని ఆర్థిక నిపుణులు  అభిప్రాయపడుతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎంలలో నగదు లోడింగ్‌ను ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో ఆయా బ్యాంక్ ఏటీఎంలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 

ఆ నాలుగు రోజులు సెలవులు ఇవే..
♦ మార్చి 24 గురువారం  హోలీ
♦ మార్చి 25 శుక్రవారం  గుడ్ ఫ్రైడే
♦ మార్చి 26 నాలుగో శనివారం, 27 ఆదివారం

ప్రస్తుతం నెలలో రెండు శనివారాలు బ్యాంకులకు సెలవు, మరో రెండు శనివారాలు పూర్తి పని వేళలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు