భారీగా తగ్గిన భెల్ నికర లాభం

8 Aug, 2015 00:26 IST|Sakshi
భారీగా తగ్గిన భెల్ నికర లాభం

82 శాతం క్షీణత  నికర అమ్మకాలు 16 శాతం డౌన్

 న్యూఢిల్లీ : విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ భెల్ నికర లాభం (స్టాండెలోన్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 82 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.194 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.34 కోట్లకు తగ్గిందని భెల్ తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.5,068 కోట్ల నుంచి 16 శాతం క్షీణించి రూ.4,281 కోట్లకు తగ్గాయని కంపెనీ వివరించింది.

విద్యుత్ రంగ ఆదాయం రూ.4,144 కోట్ల నుంచి రూ.3,357 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఈ ఏడాది జూలై 30 నాటికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.1,16,200 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కజకిస్థాన్ కంపెనీలతో భెల్ మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భెల్ షేర్ ధర శుక్రవారం బీఎస్‌ఈలో 6 శాతం మేర క్షీణించి రూ.266 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు