బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు

25 Sep, 2019 04:28 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 15.95 లక్షలు –  22.50 లక్షలు

ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్‌’ తాజాగా భారత్‌లో రెండు అధునాతన బైక్‌లను ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 ఆర్, బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 ఆర్‌టీ’ పేర్లతో వీటిని మంగళవారం విడుదలచేసింది. ఈ నూతన సూపర్‌ బైక్‌ల ధరల శ్రేణి వరుసగా రూ. 15.95 లక్షలు,  రూ. 22.50 లక్షలుగా నిర్ణయించింది. రెండు మోడళ్లలో 1,254 సీసీ ఇంజిన్లను అమర్చింది. ఆటోమేటిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఏఎస్‌సీ), యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌ ప్రో) వంటి అధునాతన ఫీచర్లు వీటిలో ఉన్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు