మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ సెడాన్‌’

22 Aug, 2019 10:21 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 41.4లక్షలు – 47.9లక్షలు

గురుగ్రామ్‌: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ‘3 సిరీస్‌ సెడాన్‌’లో సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎయిట్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, 2–లీటర్ల ఇంజిన్‌ కలిగిన ఈ నూతన మోడల్‌ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. రెండు డీజిల్‌ ఇంజిన్‌ కార్లు విడుదల కాగా, వీటి ధరల శ్రేణి రూ. 41.4లక్షలు – రూ.46.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డీజిల్‌ ఇంజిన్‌ కారు ప్రారంభ ధర రూ.47.9 లక్షలుగా నిర్ణయించామని, నూతన మోడల్‌.. మునుపటి సిరీస్‌ల కంటే 55 కేజీల బరువు తక్కువగా ఉందని వివరించింది. కారు ఫీచర్ల విషయానికి వస్తే.. వైర్‌లెస్‌ చార్జింగ్, ఆపిల్‌ కార్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగులు ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు