Sakshi News home page

ఈ వారం మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - హోండా నుంచి హ్యుందాయ్ వరకు..

Published Sat, Sep 9 2023 9:18 PM

Car Launches this Week Honda Elevate Hyundai Venue ADAS and More - Sakshi

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హోండా ఎలివేట్ (Honda Elevate)
హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS)
ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది.

వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge)
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది.

బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు!

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ (Hyundai i20 facelift)
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్‌తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement