బాష్‌లో కొలువుల జోష్‌

8 Feb, 2018 09:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్‌ ఆటోమోటివ్‌ పరికరాల దిగ్గజం బాష్‌ భారత్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ కోసం 10,000 మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. రానున్న కొన్నేళ్లలో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి టెక్నాలజీపై పనిచేసేందుకు వీరిని రిక్రూట్‌ చేసుకోనుంది. వినూత్న ఉత్పత్తుల తయారీకి, వచ్చే రెండేళ్లలో భారత్‌లో రూ 500 కోట్ల నుంచి రూ 800 కోట్ల వరకూ పెట్టుబడి పెడుతున్నట్టు బాష్‌ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సౌమిత్ర భట్టాచార్య చెప్పారు.

ఐఓటీపై భారీగా వెచ్చిస్తున్నామని, భవిష్యత్‌లో దీనికి మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఎలక్ర్టిక్‌ వాహనాలు పెరుగుతున్న క్రమంలో బ్యాటరీల తయారీని చేపట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తోందని, దీనిపై త్వరలోనే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. భారత్‌లో బాష్‌ తన రెండో అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను బెంగళూర్‌లో నిర్వహిస్తోంది. ఈ సెంటర్‌లో 18,000 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు